Prabhas: ప్రభాస్ తో మారుతి సినిమా మొదలైపోయిందట!

Prabhas and Maruthi Cinema Update
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'ఆది పురుష్'
  • షూటింగు దశలో 'సలార్' .. 'ప్రాజెక్టు K'
  • సెట్స్ పైకి వెళ్లిన 'రాజా డీలక్స్'
  • లైన్లో 'స్పిరిట్' సినిమా  
ప్రభాస్ నుంచి పౌరాణిక చిత్రంగా 'ఆది పురుష్' రానుంది. ఇక మాస్ యాక్షన్ మూవీగా సెట్స్ పైకి వెళ్లిన 'సలార్' షూటింగు దశలో ఉంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K' చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా చేయవలసి ఉంది. అయితే ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు .. ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా సమయం పడుతుంది. 

అందువలన ఆడియన్స్ తో మరీ గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతో మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ప్రభాస్ అంగీకరించాడు. ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. 'రాజా డీలక్స్ అనేది ఒక పాత సినిమా థియేటర్. ఆ థియేటర్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా నడుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు దసరాకి మొదలుకానున్నట్టు వార్తలు వచ్చాయి. 

అలాగే దసరా నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైపోయిందని అంటున్నారు. పెద్దగా హడావిడి చేయకుండా ప్రభాస్ - మారుతి ఈ సినిమాను సైలెంటుగా కానిచ్చేస్తున్నారని చెబుతున్నారు. బడ్జెట్ పరంగా ఈ సినిమా మారుతి రేంజులో ఉన్నప్పటికీ, కంటెంట్ పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికలుగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు ఎవరనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.
Prabhas
malavika Mohanan
Maruthi Movie

More Telugu News