Gallup law and order index: ‘నివాసానికి’ అత్యంత ప్రమాదకర దేశాలు ఇవే!

These are 5 most and leas secure countries on Gallup law and order index
  • ఆఫ్ఘనిస్థాన్ లో రక్షణ పాళ్లు అతి తక్కువ
  • ఈ దేశానికి 51పాయింట్లు
  • సింగపూర్ లో భద్రత ఎక్కువ
  • ఈ దేశానికి 96 పాయింట్లు కేటాయింపు
  • గాల్లప్ శాంతి భద్రతల సూచీ 2022 విడుదల
ఈ భూమిపై నివసించడానికి అత్యంత ప్రమాదకర దేశాలు ఏవో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? ‘గాల్లప్ శాంతి భద్రతల సూచీ 2022’ ఈ వివరాలను వెల్లడించింది. వరుసగా మూడో ఏడాది ప్రపంచంలో భద్రత అతి తక్కువగా ఉన్న దేశంగా తాలిబాన్లు ఏలుతున్న ఆఫ్ఘనిస్థాన్ నిలిచింది. ఈ దేశం స్కోర్ 51గా ఉంది. గాబాన్ 54, వెనెజులా 55, డీఆర్ కాంగో 58, సియెర్రా లియోన్ 59 స్కోరుతో భద్రత తక్కువగా ఉన్న టాప్-5 దేశాలుగా నిలిచాయి. తూర్పు ఆసియాలో భద్రత ఎక్కువ ఉండగా, ఆగ్నేయాసియా రెండో స్థానంలో ఉంది.

అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ 96 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. తజకిస్థాన్ 95, నార్వే 93, స్విట్జర్లాండ్ 92, ఇండోనేషియా 92 పాయింట్లతో తర్వాత ఉన్నాయి. ఈ ఇండెక్స్ లో భారత్ 80 పాయింట్లతో ఉంది. పాకిస్థాన్, శ్రీలంక కంటే భారత్ దిగువన ఉండగా.. అదే సమయంలో బ్రిటన్, బంగ్లాదేశ్ కంటే ఎగువన ఉంది. వ్యక్తిగత భద్రత విషయంలో ప్రజల స్పృహ, నేరాలు, చట్టాల అమలు విషయంలో వారికి ఎదురైన అనుభవంపై ప్రశ్నల ఆధారంగా గాల్లప్ దేశాలకు ఈ ర్యాంకులను కేటాయించింది.
Gallup law and order index
secure countries
Least security
afganistan

More Telugu News