Telangana: మునుగోడులో టీఆర్ఎస్ గెలవకుంటే రాజీనామా చేస్తా: బోధన్ ఎమ్మెల్యే షకీల్

yts mla shakeel says will resign if trs loses munugode bypoll
  • బోధన్ లో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న షకీల్
  • మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న ఎమ్మెల్యే
  • రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్య
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ నేత, బోధన్ ఎమ్మెల్యే మొహ్మద్ షకీల్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని ఆయన అన్నారు. ఒక వేళ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా దక్కదని షకీల్ అన్నారు.

మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బోధన్ పరిధిలోని నవీపేట్ మండలంలో గురువారం పర్యటించిన సందర్భంగా షకీల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 119 సీట్లలో 103 ఎమ్మెల్యేలను కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేనంత బలమైన ప్రభుత్వాన్ని తెలంగాణలో టీఆర్ఎస్ నెలకొల్పిందని ఆయన అన్నారు. ఇలాంటి బలమైన ప్రభుత్వాన్ని కూలదోసే యత్నాలకు బీజేపీ పాల్పడుతోందన్నారు. అయితే తెలంగాణలో బీజేపీ కుట్రలు సాగవని ఆయన అన్నారు.
Telangana
TRS
Bhodhan
Munugode
Komatireddy Raj Gopal Reddy
BJP
Mohammed Shakeel Amer

More Telugu News