Prime Minister: రిషి సునాక్ కు ఫోన్ చేసిన మోదీ... బ్రిటన్ నూతన ప్రధానికి అభినందనలు తెలిపిన భారత ప్రధాని

pm modi Congratulated britain new pm rishi sunak by phone
  • బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్
  • సునాక్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందించిన మోదీ
  • భారత్, బ్రిటన్ బంధాలపై ఇరువురు నేతల మధ్య చర్చ
బ్రిటన్ నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత రిషి సునాక్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి రిషి సునాక్ కు ఫోన్ చేశారు. బ్రిటన్ నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సునాక్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన మోదీ... రిషి సునాక్ తో మాట్లాడటం సంతోషంగా ఉందని తెలిపారు. 

ఈ సందర్భంగా కలిసి పని చేద్దామని సునాక్ కు మోదీ తెలిపారు. భారత్, బ్రిటన్ ల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుదామని మోదీ ఆయనకు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై వీలయినంత త్వరగా ఓ అవగాహనకు రావాల్సి ఉందని కూడా సునాక్ కు మోదీ తెలిపారు. ఈ ప్రతిపాదనకు సునాక్ కూడా సానుకూలంగా స్పందించినట్లు మోదీ వెల్లడించారు.
Prime Minister
Narendra Modi
Britain
Rishi Sunak

More Telugu News