TDP: టీడీపీ ఎన్నారై విభాగంలో కెనడా, దక్షిణాఫ్రికా కమిటీలకు నూతన కార్యవర్గాల నియామకం
- కెనడాలోని 3 ఎగ్జిక్యూటివ్ కమిటీలకు నూతన కార్యవర్గాలు
- దక్షిణాఫ్రికా ఎగ్జిక్యూటివ్ కమిటీకి నూతన కార్యవర్గం ప్రకటన
- టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నూతన కార్యవర్గాలు
- జాబితాలు విడుదల చేసిన పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
టీడీపీ ఎన్నారై విభాగంలో రెండు దేశాల్లోని కమిటీలకు నూతన కార్యవర్గాలను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం గురువారం నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కమిటీల కార్యవర్గాలను ప్రకటించారు. కెనడాలోని 3 కమిటీలతో పాటు దక్షిణాఫ్రికాలోని ఓ కమిటీకి నూతన కార్యవర్గాలను అచ్చెన్న ప్రకటించారు.
కెనడా వెస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడిగా సుమంత్ సుంకర నియమితులయ్యారు. ఈ కమిటీకి ఉపాధ్యక్షుడిగా వీరేంద్ర జెట్టి, ప్రధాన కార్యదర్శిగా రాకేశ్ జమ్ముల, కోశాధికారిగా సందీప్ రెడ్డి వసుదేవుల, ప్రాంతీయ సమన్వయకర్తగా నాని కొల్లి, మీడియా సమన్వయకర్తగా అశోక్ రెడ్డి అవనిగడ్డ నియమితులయ్యారు.
అదే సమయంలో కెనడా ఈస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడిగా మురళీ కృష్ణ గడిపర్తి నియమితులయ్యారు. ఈ కమిటీకి ఉపాధ్యక్షుడిగా ఒంకిన శేఖర్, ప్రధాన కార్యదర్శిగా విజయ్ పమిడిముక్కల, కోశాధికారిగా రామ శంకరశెట్టి, ప్రాంతీయ సమన్వయకర్తగా అన్నపూర్ణ నిమ్మగడ్డ, మీడియా సమన్వయకర్తగా భారతి దాసరి నియమితులయ్యారు.
కెనడా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా రామకృష్ణ వడ్డెంపూడి నియమితులయ్యారు. ఈ కమిటీకి ఉపాధ్యక్షుడిగా రాకేశ్ సూరపనేని, ప్రధాన కార్యదర్శిగా మణి రాఘవ కొప్పారపు, కోశాధికారిగా ప్రీతమ్ ముట్లూరు, ప్రాంతీయ సమన్వయకర్తగా అశోక్ బిక్కు, మీడియా సమన్వయకర్తగా తేజస్విని ఓరుగంటి నియమితులయ్యారు.
దక్షిణాఫ్రికా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడిగా రామకృష్ణ పార నియమితులయ్యారు. ఈ కమిటీకి ఉపాధ్యక్షుడిగా సత్య తేజ కొమ్మినేని, ప్రధాన కార్యదర్శిగా రమేశ్ బాబు తానాల, కోశాధికారిగా వంశీ బండారు, ప్రాంతీయ సమన్వయకర్తగా రమ బుడిపూడి, మీడియా సమన్వయకర్తగా రాములు గుమ్మడి నియమితులయ్యారు.