Vellampalli Srinivasa Rao: అర్హత ఉంటే నారా దేవాన్ష్ కు కూడా అమ్మ ఒడి ఇస్తాం: వైసీపీ నేత వెల్లంపల్లి

Vellampalli Srinivas participates in Gadapa Gadapaku program in Vijayawada
  • విజయవాడలో 'గడపగడపకు' కార్యక్రమం
  • పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి
  • వర్ల రామయ్య నివాసానికి కూడా వెళ్లిన వైనం
  • ప్రభుత్వ పథకాల కరపత్రాన్ని వర్ల రామయ్య డ్రైవర్ కు అందజేత
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ నేడు విజయవాడలో 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నివాసానికి కూడా వెళ్లారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాన్ని వర్ల రామయ్య నివాసంలో ఆయన డ్రైవర్ కు అందజేశారు. 

ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, వర్ల రామయ్య ఇంట్లోనూ రైతు భరోసా ఇస్తున్నామని వెల్లడించారు. వర్ల రామయ్య కూడా ప్రభుత్వ పథక లబ్దిదారేనని పేర్కొన్నారు. అర్హత ఉంటే నారా దేవాన్ష్ కు కూడా అమ్మ ఒడి వర్తింపజేస్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. తాము ఏ పార్టీ అని చూడడంలేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని వివరించారు.
Vellampalli Srinivasa Rao
Varla Ramaiah
Nara Devansh
Govt Schemes
YSRCP
Andhra Pradesh

More Telugu News