Sensex: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 203 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 50 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- ఐదున్నర శాతం లాభపడ్డ మారుతి షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు గురైనప్పటికీ... చివరకు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 203 పాయింట్లు లాభపడి 59,960కి చేరుకుంది. నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 17,786 వద్ద స్థిరపడింది. ఆటో, ఎనర్జీ స్టాకులు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (5.49%), రిలయన్స్ (3.10%), ఎన్టీపీసీ (1.99%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.61%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.40%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.54%), టెక్ మహీంద్రా (-2.53%), సన్ ఫార్మా (-2.23%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.63%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.52%).