Peddireddi Ramachandra Reddy: తప్పుడు వార్తలతో చంద్రబాబు తల రాతను మార్చలేరు: పెద్దిరెడ్డి

You can not change Chandrababu fate with false news says Peddireddi
  • విశాఖ రాజధానిగా ఇష్టం లేక తప్పుడు వార్తలు రాస్తున్నారన్న పెద్దిరెడ్డి 
  • ఈనాడుకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని వ్యాఖ్య 
  • అమరావతి రైతులు పాదయాత్రను ఎందుకు ఆపేశారో అర్థం కావడం లేదన్న మంత్రి 
విశాఖ రాజధాని కావడం కొన్ని పత్రికలకు ఇష్టం లేదని, అందుకే తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. మూడు రాజధానులే వైసీపీ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఈనాడు పత్రికకు టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చి పట్టుకుందని విమర్శించారు. విశాఖ భూకబ్జాలకు సంబంధించి గతంలో సిట్ వేసింది చంద్రబాబు హయాంలోనే కదా? అని ప్రశ్నించారు. మీరు రాసే తప్పుడు వార్తలతో చంద్రబాబు తలరాతను మార్చలేరని అన్నారు. 

విశాఖలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. విశాఖలోని రిషికొండకు టీడీపీ నేతలు వెళ్తే ఉత్తరాంధ్రను రక్షించినట్టు అవుతుందా? అని ప్రశ్నించారు. అమరావతి రైతులు పాదయాత్రను మధ్యలోనే ఎందుకు ఆపేశారో అర్థం కావడం లేదని అన్నారు.
Peddireddi Ramachandra Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Eenadu
Vizag

More Telugu News