Gorantla Madhav: చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వాడికి ఉరిశిక్ష విధించాలి: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్
- హైదరాబాద్ డీఏవీ స్కూల్ లో చిన్నారిపై డ్రైవర్ లైంగిక దాడి
- తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఘటన
- దాడికి పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలన్న మాధవ్
హైదరాబాద్ లోని డీఏవీ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలని... వాడికి ఉరిశిక్షే సరైనదని ఆయన అన్నారు. ఈ ఘటనలో నిందితుడికి శిక్ష విధించే క్రమంలో అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఏపీలో శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని కితాబునిచ్చారు.