TRS: ఫామ్ హౌస్ కేసులో బీజేపీ పిటిషన్.. విచారణపై స్టే విధించిన హైకోర్టు

TS HC stays interrogation on MLAs poachin case until Munugode by polls
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాల కేసు
  • నిందితుల రిమాండ్ కు అనుమతించిన హైకోర్టు
  • మునుగోడు ఉప ఎన్నిక ముగిసేంత వరకు విచారణ జరపొద్దని ఆదేశం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలు జరిపారనే కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసుపై విచారణ జరపకుండా ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... మునుగోడు ఉపఎన్నిక పూర్తయ్యేంత వరకు ఈ కేసును విచారించకుండా స్టే విధించింది. అప్పటి వరకు విచారణను జరపవద్దని ఆదేశించింది. 

నిందితుల రిమాండ్ పై స్టే ఉండదని చెప్పింది. ఈ కేసులో రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజిలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులు పార్టీ మారితే డబ్బులు, పదవులు ఇస్తామంటూ బేరాలాడినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
TRS
MLAs
Poaching
Case
Munugode
BJP

More Telugu News