Vande Bharat Express: ఈసారి ఎద్దును ఢీకొట్టి నిలిచిపోయిన వందేభారత్ రైలు
- వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని
- తొలుత పశువుల మందను, ఆపై ఆవును ఢీకొట్టిన వైనం
- నేడు అతుల్ స్టేషన్ వద్ద ఎద్దును ఢీకొట్టిన రైలు
భారత్ లో సెమీ హైస్పీడ్ రైలుగా గుర్తింపు పొందిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ నేడు ఓ ఎద్దును ఢీకొని నిలిచిపోయింది. ఇలాంటి ప్రమాద ఘటన జరగడం నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి.
ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించగా, గుజరాత్ లోని వాత్వా స్టేషన్ వద్ద పశువుల మందను ఢీకొట్టి నిలిచిపోయింది. ఆ తర్వాత ఓ ఆవును ఢీకొట్టింది. తాజాగా ఎద్దును ఢీకొట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు మరోసారి వార్తల్లోకెక్కింది.
గాంధీనగర్-ముంబయి మార్గంలో గుజరాత్ లోని అతుల్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎద్దును ఢీకొనడంతో ఇంజిన్ ముందుభాగం కవర్ ఊడిపోయింది. దాంతో పావుగంట సేపు రైలు నిలిచిపోయింది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, పశువులు ఢీకొనే ఘటనలను నివారించలేమని, రైలును డిజైన్ చేసేటప్పుడు ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు.