Tungabhadra River Board: తుంగభద్ర నదీ బోర్డు నిర్ణయాలపై తెలంగాణ అభ్యంతరాలు

Telangana defers Tungabhadra Board decisions

  • కృష్ణా ట్రైబ్యునల్ తీర్పునకు భిన్నంగా ఉన్నాయని వెల్లడి
  • ట్రైబ్యునల్ అవార్డు అతిక్రమించారని ఆరోపణ
  • తుంగభద్ర బోర్డు కార్యదర్శికి తెలంగాణ ఈఎన్సీ లేఖ

తుంగభద్ర నదీ బోర్డు నిర్ణయాలపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బోర్డు నిర్ణయాలు కృష్ణా మొదటి ట్రైబ్యునల్ తీర్పునకు భిన్నంగా నిర్ణయాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.  ట్రైబ్యునల్ అవార్డు అతిక్రమించి బోర్డు నిర్ణయాలు తగవని పేర్కొంది. ఏపీకి నీటి మళ్లింపు నిర్ణయం ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధమని వివరించింది. 

తుంగభద్ర నుంచి హైలెవల్ కెనాల్ ద్వారా ఏపీకి నీటిని మళ్లించాలన్న నిర్ణయం తీసుకున్నారని, ట్రైబ్యునల్ అవార్డుకు భిన్నంగా నీటి మళ్లింపు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం తన లేఖలో కోరింది. 

డ్యామ్ కు అధికశాతం ఖర్చు తాము భరించాలనడం తగదని పేర్కొంది. ఈ రెండు నిర్ణయాలు సవరించాలని కోరింది. ఈ మేరకు తుంగభద్ర బోర్డు కార్యదర్శికి తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు.

  • Loading...

More Telugu News