Kangana Ranaut: కంగనా వస్తానంటే స్వాగతిస్తాం.. టికెట్ పై ఇప్పుడే చెప్పలేం: జేపీ నడ్డా

Kangana Ranaut is welcome to join BJP
  • కలిసి పనిచేయాలనుకుంటే ఎవరైనా బీజేపీలో చేరొచ్చు
  • ఎన్నికల్లో పోటీ విషయంపై పార్టీలో చర్చించాకే నిర్ణయం
  • టికెట్ ఇవ్వడమనేది నా ఒక్కడి చేతిలోనే లేదన్న పార్టీ చీఫ్
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ను పార్టీలోకి స్వాగతిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. అయితే, పార్టీ టికెట్ ఇచ్చే విషయం ఇప్పుడే చెప్పలేమని ఆయన వివరించారు. బీజేపీతో కలిసి పనిచేయాలనుకునే వారికి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన ఈ సందర్భంగా కామెంట్ చేశారు. పార్టీ టికెట్ ఇవ్వడం తన ఒక్కడి చేతిలో లేదని, అంతర్గతంగా చర్చించి ఎవరికి టికెట్ ఇవ్వాలో పార్టీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయిస్తామని తెలిపారు. స్థానిక కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, వాటిపై చర్చించాకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, అక్కడ పార్టీ టికెట్ల కేటాయింపుపై ఇప్పుడే మాట్లాడలేమని నడ్డా వెల్లడించారు.

రాజకీయాల్లోకి రావడంపై కంగనా రనౌత్ శనివారం స్పష్టత ఇచ్చారు. బీజేపీ టికెట్ ఇస్తే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమేనని ప్రకటించారు. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్పందించారు. పార్టీలో చేరాలనుకుంటే కంగాన రనౌత్ కు స్వాగతం పలుకుతామని తెలిపారు.
Kangana Ranaut
JP Nadda
BJP
Himachal Pradesh

More Telugu News