CBI: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ

Telangana government withdrawn permission to the CBI investigation

  • నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
  • గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది
  • ఆగస్టు 30న జారీ చేసిన జీవో 51 తాజాగా వెలుగులోకి

రాష్ట్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి గతంలో ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకుంటూ జీవో 51ను ఆగస్టు 30న జారీ చేసింది.

గతంలోనే రద్దు ఆలోచన?
తెలంగాణలోకి సీబీఐ ప్రవేశాన్ని అడ్డుకోవాలనే నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనూ ఆలోచనలు చేసినట్లు అధికారవర్గాల సమాచారం. దీనిపై సలహాలు, సూచనలూ ఆయన స్వీకరించారని చెప్పారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వివిధ కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో సీబీఐకి గతంలో ఇచ్చిన సాధారణ సమ్మతిని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఎందుకీ అనుమతి..
ఢిల్లీ అవినీతి నిరోధక చట్టం-1988, ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం.. ఒక్క ఢిల్లీ మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ సీబీఐకి నేరుగా దర్యాఫ్తు చేసే అధికారంలేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సాధారణ సమ్మతి(జనరల్ కన్సెంట్) తోనే కేసు విచారణను చేపట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతిని ఈ చట్టం తప్పనిసరి చేసింది. గతంలో సమ్మతి తెలిపి ఆ తర్వాత ఉపసంహరించుకున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ లోనూ 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News