Soccer World Cup: విదేశీ కార్మికులను ఉన్నపళంగా ఖాళీ చేయిస్తున్న ఖతార్.. కారణం ఇదే!

Qatar evacuating foreigner labour from Doha for soccer world cup

  • ఖతార్ లో వచ్చే నెల 20 నుంచి ఫుట్ బాల్ ప్రపంచ కప్
  • ప్రపంచ నలుమూలల నుంచి తరలి వస్తున్న సాకర్ ప్రియులు
  • అభిమానులకు నివాసం కల్పించేందుకు విదేశీ కార్మికులను ఖాళీ చేయిస్తున్న ఖతార్

విదేశీ కార్మికులకు ఖతార్ చుక్కలు చూపిస్తోంది. రాజధాని దోహాలో ఉన్న విదేశీ కార్మికులను ఉన్నపళంగా ఖాళీ చేయిస్తోంది. అర్ధరాత్రి అని కూడా చూడకుండా, సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా ఖాళీ చేసి వెళ్లిపోమంటోంది. దీనికి కారణం ఫుట్ బాల్ ప్రపంచకప్. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫుట్ బాల్ ప్రపంచకప్ కు ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. వచ్చే నెల 20 నుంచి ప్రపంచ కప్ జరగనుంది. ఈ మ్యాచ్ లను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి సాకర్ అభిమానులు తరలి వస్తున్నారు. 

లక్షలాది మంది అభిమానులు తరలి వస్తుండటంతో వీరికి వసతి కల్పించడం సమస్యగా మారింది. దీంతో, దోహాలో ఉన్న విదేశీ కార్మికులను ఖాళీ చేయిస్తోంది. కేవలం రెండు గంటల ముందు నోటీసులు ఇచ్చి వెళ్లిపోమంటోంది. ఖతార్ జనాభా 30 లక్షలు కాగా... వీరిలో 85 శాతం మంది విదేశీ కార్మికులే. వీరిలో ఎక్కువ మంది దినసరి కార్మికులుగా, డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఖతార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశీ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News