Sensex: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు... మరోసారి 60 వేలు దాటిన సెన్సెక్స్
- అంతర్జాతీయ సానుకూలతలతో జోరుమీదున్న మార్కెట్లు
- 60,547 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్
- 17,951కి చేరుకున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. గత వారాన్ని అమెరికా మార్కెట్లు లాభాలతో ముగించాయి. ఈరోజు ఏసియా పసిఫిక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మన మార్కెట్లు లాభాల్లోకి దూసుకుపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 577 పాయింట్ల భారీ లాభంతో 60,547 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 164 పాయింట్లు ఎగబాకి 17,951 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఆటోమోబైల్స్, ఐటీ, టెక్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ తదితర సూచీలు భారీ లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, మారుతి కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.