Andhra Pradesh: ఏపీలో కల్లుగీత కార్మికుల పరిహారాన్ని రెట్టింపు చేసిన వైసీపీ సర్కారు

ap government releases toddy toppers new policy

  • 2022- 27కు నూతన కల్లుగీత విధానాన్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • మరణించిన కల్లుగీత కార్మిక కుటుంబాలకిచ్చే పరిహారం రూ10 లక్షలకు పెంపు
  • గీత కార్మికుల నుంచి వసూలు చేస్తున్న తాడి చెట్ల అద్దెను రద్దు చేస్తూ నిర్ణయం

కల్లు గీత కార్మికులు మరణిస్తే... వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం రెండింతలు చేసింది. ఈ మేరకు రానున్న ఐదేళ్లకు (2022-27) కల్లు గీత నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం కల్లు గీత కార్మికులు మరణిస్తే... వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. నూతన కల్లు గీత విధానం ద్వారా ఈ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచిరూ.10 లక్షలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

నరేగా, ఇతరత్రా ప్రభుత్వ పథకాల ద్వారా కల్లు గీత కార్మికులను ఆదుకుంటామని తన నూతన విధానంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కల్లు గీత కార్మికులకు వైఎస్సార్ బీమాను వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గీత కార్మికుల నుంచి వసూలు చేస్తున్న తాడిచెట్టు అద్దెను రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది.

  • Loading...

More Telugu News