Artist: లక్ష సార్లు ‘రామ’ అని రాస్తూ, రాముడి చిత్రపటాన్ని గీసిన కళాకారిణి.. వీడియో ఇదిగో

Artist creates Ram Darbar sketch by writing Ram over one lakh times Watch
  • జోధ్ పూర్ యువతి అద్భుత కళా ప్రతిభ
  • స్కెచ్ పెన్నుల వినియోగం
  • లక్షా 11 సార్లు రామ నామం రాయడంతో దేవుడి రూపాలు  
మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యక్తుల సృజనాత్మకత ప్రపంచానికి వేగంగా తెలిసిపోతోంది. ఎక్కువ మందిని చేరుతోంది. రామ అని రాస్తూ, రామ నామాలతో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు చిత్ర పటంగా మారిస్తే అద్భుతంగా ఉంటుంది కదా?

ఓ యువతి ఇప్పుడు ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించింది. చేత్తో రామ అని రాస్తూ అద్భుతమైన పెయింటింగ్ గా మలిచింది. ఇది నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఆమె రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన డాక్టర్ శివానీ మందా. పెయింట్, బ్రష్ లతో పని లేకుండా.. కేవలం స్కెచ్ పెన్నుల సాయంతో దేవనాగరి లిపిలో రామ్ అని ఒక లక్షా 11 సార్లు రాసి అద్భుతమైన పెయింటింగ్ గా మార్చింది.  కాకపోతే ఆమె రంగు రంగుల స్కెచ్ పన్నులను ఇందుకు వినియోగించింది (వీడియో కోసం)
Artist
sketch
writing Ram
creates
Ram Darbar
vedio

More Telugu News