Chiranjeevi: బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ కు ఆవకాయ రుచిచూపించిన చిరంజీవి

Chiranjeevi hosts traditional dinner to Britain Dy High Commissioner Gareth  Wynn Owen
  • తెలుగు రాష్ట్రాలకు కొత్త బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
  • గారెత్ ఓవెన్ కు చిరంజీవి ఆతిథ్యం
  • చిరు నివాసంలో విందు సమావేశం
  • తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు
తెలుగు రాష్ట్రాలకు బ్రిటన్ నూతన డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులైన గారెత్ విన్ ఓవెన్ కు మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. దీనిపై చిరంజీవి ట్వీట్ చేశారు. 

"హైదరాబాదులోని బ్రిటన్ నూతన డిప్యూటీ కమిషనర్ తో భేటీ కావడం ఆనందం కలిగించింది. సుహృద్భావ వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో బ్రిటన్, భారత్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాం. నా నివాసంలో ఆయనకు కొన్ని తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశాను. ఆవకాయను మర్చిపోలేదండోయ్!" అంటూ చిరంజీవి వివరించారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాదులో ఇప్పటిదాకా డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరించారు. ఫ్లెమింగ్ పదవీకాలం జులైలో ముగియగా, ఆయన స్థానంలో గారెత్ విన్ ఓవెన్ నూతన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులయ్యారు.
Chiranjeevi
Gareth Wynn Owen
Britain Dy High Commissioner
Hyderabad
Telangana
Andhra Pradesh

More Telugu News