Telangana: ప్రచారం ముగుస్తున్న వేళ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భారీ ఊరట

ec gives clean chit to munugode bypoll bjp candidate komatireddy raj gopal reddy

  • నేటితో ముగియనున్న మునుగోడు ఎన్నికల ప్రచారం
  • సరిగ్గా ప్రచారం ముగుస్తున్న వేళ ఈసీ నుంచి కీలక ప్రకటన
  • కోమటిరెడ్డిపై అందిన ఫిర్యాదు నిరాధారమైనదని వెల్లడి

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడుతున్న వేళ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంగళవారం మధ్యాహ్నం భారీ ఊరట లభించింది. ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా పెద్ద ఎత్తున నిధులను ఇతరులకు పంపిణీ చేశారంటూ కోమటిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం... ఆ ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. ఈ మేరకు ఎన్నికల ప్రచారం ముగియనున్న సమయంలో కోమటిరెడ్డికి ఊరట కల్పిస్తూ ఎన్నికల సంఘం ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది.

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఈ క్రమంలో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల్లో భాగంగా కోమటిరెడ్డి కంపెనీ ఖాతా నుంచి ఇతరులకు రూ.5.26 కోట్లు బదిలీ అయ్యాయని కొందరు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఈసీ...కోమటిరెడ్డిపై అందిన ఫిర్యాదుకు ఆధారాలేమీ లేవని తెలిపింది. ఈ ఫిర్యాదు నిరాధార ఆరోపణలతోనే చేసిందని కూడా ఈసీ తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News