Vande Bharat Trains: త్వరలో పరుగులు తీయనున్న మరో 25 వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు

25 more Vande Bharat semi high speed trains will be introduced soon

  • ఇప్పటివరకు దేశంలో మూడు వందేభారత్ రైళ్లు
  • చెన్నైలోని ఐసీఎఫ్ లో వందేభారత్ రైళ్ల తయారీ
  • మార్చి నాటికి కొత్త వందేభారత్ రైళ్లు

భారత్ లో ప్రస్తుతం మూడు వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే మరో 25 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్త వందేభారత్ రైళ్లను పరుగులు తీయించాలన్నది రైల్వే శాఖ ప్రణాళిక. 

వందేభారత్ 2.0 రైళ్లను చెన్నైలోని ఇంటెగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో రూపొందిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 27 వందేభారత్ రైళ్లను తయారుచేయాలని ఐసీఎఫ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

2019లో దేశంలో తొలి వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇది న్యూఢిల్లీ-వారణాసి మధ్య ప్రయాణిస్తుంది. రెండో వందేభారత్ రైలును న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణోదేవి మార్గంలో ప్రవేశపెట్టారు. ఇటీవల ప్రధాని మోదీ మూడో వందేభారత్ రైలును ప్రారంభించారు. ఇది గాంధీ నగర్-ముంబయి మార్గంలో ప్రయాణిస్తుంది.

  • Loading...

More Telugu News