Andhra Pradesh: పవన్ కల్యాణ్ కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదు: సోము వీర్రాజు

bjp ap chief somu veerraju demands action against persons who spotted at pawan kalyan house
  • ఏపీలో మిత్రపక్షాలుగా కొనసాగుతున్న బీజేపీ, జనసేన
  • పవన్ ఇంటి వద్దకు అపరిచితులు వచ్చారన్న వార్తపై స్పందించిన వీర్రాజు
  • అపరిచితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అనుసరిస్తూ పలువురు వ్యక్తులు అనుమానాస్పదంగా కదలాడుతున్నారంటూ వచ్చిన వార్తలపై బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా స్పందించారు. పవన్ కల్యాణ్ కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు.

హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ ఇంటి వద్దకు రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి.. పవన్ బౌన్సర్లతో గొడవ పడ్డ వైనాన్ని ఈ సందర్బంగా వీర్రాజు ప్రస్తావించారు. పవన్ ఇంటి వద్దకు వచ్చిన అపరిచితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కు పొంచి ఉన్న ముప్పుపై సోము వీర్రాజు స్పందించారన్న వాదన వినిపిస్తోంది.
Andhra Pradesh
BJP
Somu Veerraju
Pawan Kalyan
Janasena

More Telugu News