GH Thippareddy: బీజేపీ ఎమ్మెల్యేకి వీడియో కాల్ చేసి దుస్తులు విప్పేసిన మహిళ... హడలిపోయి భార్యకు ఫోన్ ఇచ్చేసిన ఎమ్మెల్యే

BJP MLA shocks after a woman made video call and flashed at him
  • కర్ణాటకలోని చిత్రదుర్గ ఎమ్మెల్యేకి ఊహించని అనుభవం
  • పలుమార్లు కాల్ చేసి బెంబేలెత్తించిన మహిళ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే తిప్పారెడ్డి
కర్ణాటకలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. ఓ మహిళ వీడియో కాల్ చేసి దుస్తులు విప్పేయడంతో ఆయన బెంబేలెత్తిపోయారు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు. 

తిప్పారెడ్డి చిత్రదుర్గ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 75 ఏళ్ల తిప్పారెడ్డి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, అక్టోబరు 31 సాయంత్రం ఓ మహిళ ఆయనకు వీడియో కాల్ చేసింది. ఆయన మాట్లాడుతుండగానే ఆమె దుస్తులు విప్పేయడం ప్రారంభించింది. దాంతో ఆయన కాల్ కట్ చేశారు. అయినప్పటికీ ఆమె, ఆ తర్వాత ఓ అసభ్య వీడియోను ఎమ్మెల్యే ఫోన్ కు పంపింది. ఈ మేరకు తిప్పారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొదట ఓ కాల్ వచ్చిందని, తన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదని వెల్లడించారు. అనంతరం రెండో కాల్ లో ఆమె దుస్తులు విప్పేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించిందని వివరించారు. దాంతో కాల్ ను కట్ చేశానని, తర్వాత మూడోసారి కాల్ రాగా, తన భార్యకు ఫోన్ ఇచ్చేశానని ఎమ్మెల్యే వెల్లడించారు. దాంతో ఓ పోలీస్ అధికారి సూచన మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ విభాగాన్ని ఆశ్రయించానని వివరించారు.
GH Thippareddy
Woman
Video Call
Chitradurga
Police
Karnataka

More Telugu News