Andhra Pradesh: వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మాజీ హోం మంత్రి సుచరిత రాజీనామా

ex minister mekathoti sucharitha resigns guntur district ysrcp president post

  • జగన్ కేబినెట్ లో హోం మంత్రిగా పనిచేసిన సుచరిత
  • మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోయిన వైనం
  • పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి
  • తన నియోజకవర్గానికే పరిమితమవుతానంటూ తాజాగా ప్రకటన

ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం కీలక నిర్ణయం ప్రకటించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుచరిత... జగన్ కేబినెట్ లో హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సుచరిత మంత్రి పదవిని కోల్పోయారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డ సుచరిత... జగన్ వారించడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

తదనంతర పరిణామాల్లో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా సుచరిత నియమితులయ్యారు. తాజాగా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు శుక్రవారం సుచరిత ప్రకటించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి తెలియజేశానని కూడా ఆమె తెలిపారు. ఇకపై తన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడుకే పరిమితమవుతానని ఆమె పేర్కొన్నారు. సుచరిత ప్రకటనపై వైసీపీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

  • Loading...

More Telugu News