Pawan Kalyan: రన్నింగ్ కారుపై అలా రిలాక్స్ డ్ గా కూర్చుని పవన్ జర్నీ... వైరల్ అవుతున్న వీడియో

pawan  kalyan sits on running car while going to ippatam village
  • ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్
  • ఇప్పటం వెళ్లే క్రమంలో కారు టాప్ పై కూర్చుని పవన్ జర్నీ
  • మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్
  • ఇదేం ఆటిట్యూడ్ అన్నా అంటూ సెటైర్లూ పడుతున్న వైనం
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ పర్యటనకు బయలుదేరిన జనసేనాని పవన్ కల్యాణ్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన ఆవిర్భావ సభ కోసం ఇప్పటం గ్రామస్థులు భూములు ఇచ్చారన్న ఆగ్రహంతో వైసీపీ సర్కారు... గ్రామంలో రోడ్ల వెడల్పు పేరిట ఇళ్లను కూల్చివేసిందని ఆరోపించిన పవన్... ఇళ్లు కూలిపోయిన బాధితులను పరామర్శించేందుకు శనివారం ఇప్పటంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం శుక్రవారం రాత్రికే విజయవాడ చేరుకున్న పవన్...శనివారం మధ్యాహ్నం ఇప్పటం గ్రామానికి బయలుదేరారు.

ఈ క్రమంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి తన కాన్వాయ్ లో బయలుదేరిన పవన్.... ఇప్పటం గ్రామం చేరుకోకముందే మధ్యలోనే తాను ప్రయాణిస్తున్న కారు టాప్ పైకి ఎక్కారు. అనంతరం కారు టాప్ పై అలా కాళ్లు బారజాపుకుని మరీ ఆయన రిలాక్డ్స్ డ్ గా కూర్చున్నారు. కారు వేగంగా దూసుకుపోతున్నా చలించని పవన్... కారుపై అలానే రిలాక్స్ డ్ గా కూర్చున్నారు. 

ఇక పవన్ కు రక్షణగా ఆయన అభిమానులు కారుకు ఇరువైపులా అలా నిలబడి ముందుకు సాగారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పవన్ ఫ్యాన్స్ ''మనల్ని ఎవడ్రా ఆపేది'' అనే ఓ కామెంట్ ను దానికి జత చేశారు. ఇక మరో వ్యక్తి ఇదే వీడియోను షేర్ చేస్తూ ''ఆ ఆటిట్యూడ్ చూడు తమ్ముడు'' అని వ్యాఖ్యానించాడు. మరో వ్యక్తి అయితే ''ఇదేం ఆటిట్యూడ్ అన్నా'' అంటూ సెటైర్ సంధించాడు.
Pawan Kalyan
Janasena
Mangalagiri
Ippatam
Guntur District
Social Media
Viral Videos

More Telugu News