TRS: కొనసాగుతున్న మునుగోడు ఓట్ల లెక్కింపు.. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌దే ఆధిక్యం

Munugode by Poll Results TRS Candidate is Ahead
  • పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్‌ అభ్యర్థికి ఆధిక్యం
  • తొలి రౌండ్ ముగిసే సరికి వెయ్యికిపైగా ఓట్ల ఆధిక్యం
  • పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీకి 224 ఓట్లు
రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు విడుదలవుతున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, 8.30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్‌ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. 

పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్‌కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇందులో టీఆర్ఎస్‌కు 228 ఓట్లు రాగా, బీజేపీకి 224, బీఎస్పీకి 10 ఓట్లు వచ్చాయి. ఇక, తొలి రౌండ్ లెక్కింపు ప్రారంభమయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వెయ్యికిపైగా ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
TRS
Munugode
Kusukuntla Prabhakar Reddy
BJP

More Telugu News