Suryakumar Yadav: చిచ్చరపిడుగులా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్... టీమిండియా భారీ స్కోరు

Surya Kumar Yadav smashes Zimbabwe bowling in Melbourne
  • మెల్బోర్న్ లో వరల్డ్ కప్ మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా
  • 25 బంతుల్లోనే 61 పరుగులు చేసిన సూర్యకుమార్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసిన భారత్
జింబాబ్వేతో వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు సాధించింది. 

సూర్యకుమార్ యాదవ్ కేవలం 25 బంతుల్లోనే 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య స్కోరులో 6 ఫోర్లు, 4 భారీ సిక్సులున్నాయి. ఈ ముంబయి వాలా జింబాబ్వే బౌలింగ్ లో మైదానం నలుమూలలా షాట్లు కొట్టి తన ట్రేడ్ మార్కు చూపించాడు. 

అంతకుముందు, ఓపెనర్ కేఎల్ రాహుల్ (51) అర్ధసెంచరీ సాధించగా, విరాట్ కోహ్లీ 26 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేసి ఎంగరవా బౌలింగ్ లో అవుటయ్యాడు. రోహిత్ శర్మ 15, పంత్ 3 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో షాన్ విలియమ్స్ 2, ఎంగరవా 1, ముజరబాని 1, సికిందర్ రజా 1 వికెట్ తీశారు.
Suryakumar Yadav
Team India
Zimbabwe
Melbourne
Super-12
T20 World Cup
Australia

More Telugu News