Sunitha Reddy: వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతకు క్యాపిటల్ ఫౌండేషన్ పురస్కారం

Sunitha Reddy Received Capital Foundation National Award

  • అందించిన సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ 
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నియంత్రణ విభాగంతో  కలిసి పనిచేస్తున్న డాక్టర్ సునీత
  • అంటువ్యాధుల్లో టీబీతోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయన్న డాక్టర్ సునీత

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యూయూ లలిత్ ఈ అవార్డును ఆమెకు అందజేశారు. మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు జీవన సాఫల్య పురస్కారం లభించగా, హైదరాబాద్‌కు చెందిన పురాతన కార్ల సేకర్త (కళారంగం) రామ్‌లాల్ అగర్వాల్‌కు క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అందజేశారు.

వివిధ రంగాల్లో సేవలందించిన పలువురికి క్యాపిటల్ ఫౌండేషన్.. జస్టిస్ కృష్ణయ్యర్ ఉచిత న్యాయ సేవల విభాగంతో కలిసి ఈ అవార్డులను అందజేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నియంత్రణ విభాగంతో పాటు పలు సంస్థల్లో సభ్యురాలిగా సునీత సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. అంటువ్యాధుల్లో టీబీతోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్టు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News