Munugode: మునుగోడులో టీఆర్ఎస్ కు షాకిచ్చిన కారును పోలిన గుర్తులు

Symbols similar to the car shocked TRS in Munugade
  • కారును పోలిన గుర్తులు తమకు నష్టం చేస్తున్నాయంటూ ముందు నుంచీ టీఆర్ఎస్ అభ్యంతరం
  • మునుగోడులో 5 వేలకు పైగా ఓట్లను సాధించిన ఈ గుర్తులు
  • రోటీ మేకర్ కు 2,407 ఓట్లు
తమ గుర్తు కారును పోలిన గుర్తులు టీఆర్ఎస్ పార్టీలో గుబులు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని గుర్తులను తొలగించాలంటూ కోర్టును సైతం టీఆర్ఎస్ ఆశ్రయించింది. టీఆర్ఎస్ ఆందోళన చెందినట్టే మునుగోడు ఉప ఎన్నికలలో కారును పోలిన గుర్తులు సుమారు 5 వేలకు పైగా ఓట్లను పొందాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ తగ్గింది. 

కారును పోలిన గుర్తులు తమ ఆధిక్యాన్ని తగ్గించాయని కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు. రోటీ మేకర్ గుర్తుపై పోటీ చేసిన మారమోని శ్రీశైలం యాదవ్ కు 2,407 ఓట్లు వచ్చాయి. రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ 1,874 ఓట్లను సాధించారు. టెలివిజన్ గుర్తుకు 511, కెమెరా గుర్తుకు 502, ఓడ గుర్తుకు 153, చెప్పుల గుర్తుకు 2,270 ఓట్లు పడ్డాయి.
Munugode
Car
Other symbols

More Telugu News