Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 61 వేల మార్క్ ను దాటిన సెన్సెక్స్
- 235 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 86 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3.44 శాతం పెరిగిన ఎస్బీఐ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 61,185కి చేరుకుంది, నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 18,203 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నలిచాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.44%), టాటా స్టీల్ (1.81%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.26%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.16%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.14%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-2.37%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.35%), సన్ ఫార్మా (-1.13%), టైటాన్ (-0.95%), కోటక్ బ్యాంక్ (-0.93%).