Supreme Court: నిర్ణీత గడువు కంటే ఒక రోజు ముందుగానే పదవీ విరమణ చేసిన సీజేఐ జస్టిస్ లలిత్.... కారణమిదే!

justice lalit retires as cji one day before

  • గురు నానక్ జయంతి సందర్భంగా మంగళవారం సెలవు
  • ఈ కారణంగానే ఓ రోజు ముందుగానే పదవీ విరమణ చేసిన జస్టిస్ లలిత్
  • నూతన సీజేఐగా పదవి చేపట్టనున్న జస్టిస్ చంద్రచూడ్

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ సోమవారం అత్యున్నత పదవి నుంచి సోమవారం పదవీ విరమణ చేశారు. వాస్తవానికి జస్టిస్ లలిత్ మంగళవారం (ఈ నెల 8న) వరకూ పదవిలో కొనసాగే వీలుంది. అయితే మంగళవారం గురు నానక్ జయంతిని పురస్కరించుకుని సెలవు దినం కావడంతో ఆయన సోమవారమే పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 74 రోజుల పాటు విధుల్లో కొనసాగారు.

జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ తర్వాత సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లలిత్... సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలంగా న్యాయమూర్తిగా సేవలు అందించారు. జస్టిస్ లలిత్ తన వారసుడిగా జస్టిస్ చంద్రచూడ్ ను సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం జస్టిస్ లలిత్ పదవీ విరమణ చేయడంతో కొత్తగా జస్టిస్ చంద్రచూడ్ నూతన భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి సంబంధించి ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News