Elon Musk: నచ్చకపోతే ట్విట్టర్ నుంచి వెళ్లిపోండి!: ఎలాన్ మస్క్
- మాస్టర్ బేటెడాన్ అనే అద్భుతమైన సైట్ ఉందన్న మస్క్
- ట్విట్టర్ అప్ డేట్లను తప్పుబడుతున్న యూజర్లకు చురక
- ఇది కూడా ట్విట్టర్ మాదిరి సామాజిక మాధ్యమమే
ట్విట్టర్ కొత్త అప్ డేట్లపై యూజర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో, సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కు ఆగ్రహం ముంచుకొచ్చింది. మరీ దురుసుగా ట్వీట్ పెట్టి, తర్వాత డిలీట్ చేశారు. ‘‘ట్విట్టర్ ఎంత మాత్రం నచ్చకపోతే, మాస్టర్ బేటెడాన్ అనే ఒక అద్భుతమైన సైట్ ఉంది’’ అంటూ మస్క్ ట్వీట్ చేశాడు. నచ్చని వారిని వెళ్లిపోవచ్చన్నట్టుగా ఆయన ట్వీట్ పెట్టడంపై విమర్శలు రావడంతో, దాన్ని డిలీట్ చేశారు.
మాస్టడాన్ పేరుతో మరో సామాజిక మాధ్యమ ప్లాట్ ఫామ్ ను మస్క్ ప్రస్తావించం దీన్ని మరోసారి యూజర్లకు గుర్తు చేసినట్టయింది. గంటల తరబడి ఈ ప్లాట్ ఫామ్ సర్వర్లు డౌన్ కావడంతో వ్యంగ్యంగా దీన్ని పేర్కొన్నట్టు కనిపిస్తోంది. మాస్టడాన్ అనేది కొత్తది కాదు. 2019లోనూ ఇది మనదేశంలో ప్రచారానికి నోచుకుంది. సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది సంజయ్ హెగ్డే ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేయడంతో, అప్పుడు కొంత మంది నిరసనగా మాస్టడాన్ కు వెళ్లిపోయారు. ట్విట్టర్ మాదిరి ఫీచర్లను మాస్టడాన్ అందిస్తుంటుంది. సొంత కమ్యూనిటీని ఇందులో ప్రారంభించొచ్చు. లేదంటే అప్పటికే ఉన్న మరో కమ్యూనిటీలో చేరొచ్చు.