Anand Mahindra: ‘ట్విట్టర్’లో ఆనంద్ మహీంద్రా రికార్డ్

Anand Mahindra clocks 10 million followers on Twitter Industrialist shares a note of thanks
  • కోటి దాటిన ఫాలోవర్ల సంఖ్య
  • ఇంత పెద్ద కుటుంబం ఉందంటే నమ్మలేకున్నానంటూ మహీంద్రా ట్వీట్
  • కుటుంబ నియంత్రణను ఉల్లంఘించడమేనంటూ చమత్కారం
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో రికార్డు సృష్టించారు. ఆయన ఫాలోవర్ల సంఖ్య కోటిని దాటింది. పారిశ్రామికవేత్తలకు సమయం ఎంతో విలువైనది. అయినప్పటికీ ఆయన ట్విట్టర్ వేదికగా సమాజంతోనూ కొంత సమయం పాటు మమేకం అవుతుంటారు. తన దృష్టికి వచ్చిన అరుదైన విశేషాలను షేర్ చేస్తుంటారు. ఇతరులకు స్ఫూర్తినిచ్చే వాటిని పరిచయం చేస్తుంటారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం కూడా ఆయన హాబీ. అదే ఆనంద్ మహీంద్రాకు ఉన్న విలక్షణ ప్రత్యేకత. అదే కోటి మందికి ఆయన్ను చేరువ చేసిందని చెప్పుకోవాలి.

‘‘ఇంత పెద్ద కుటుంబం ఉందంటే నమ్మలేకపోతున్నాను. ఇది స్పష్టంగా కుటుంబ నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుంది. మీ ఆసక్తి, నా పట్ల మీరు చూపిస్తున్న నమ్మకానికి మీ అందరికీ పెద్ద ధన్యవాదాలు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 

‘‘ఇది మానవత్వానికి నిదర్శనం. ఓ వ్యాపారవేత్త జీవితం కేవలం కంపెనీ బోర్డు రూమ్ లు, కుటుంబానికి పరిమితం చేయకుండా.. చిన్న చిన్న విషయాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా ఇతరులు సైతం ఆశావహంగా జీవించేలా ప్రోత్సహించొచ్చు అనే దానికి నిదర్శనం’’ అంటూ ఓ నెటిజన్ స్పందన వ్యక్తం చేశాడు. ఇతర ఫాలోవర్లు సైతం ఉత్సాహంగా స్పందిస్తున్నారు. 
Anand Mahindra
Twitter
10 million
followers
Industrialist

More Telugu News