Rains: మరింత బలపడనున్న అల్పపీడనం... ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు

Rain alert for AP

  • నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం
  • వాయవ్య దిశగా పయనం
  • ఈ నెల 11 నుంచి 13 వరకు వర్షసూచన
  • రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాలను ఆనుకుని అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని, రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ నెల 12వ తేదీ ఉదయం వరకు ఇది వాయవ్య దిశగా తమిళనాడు-పుదుచ్చేరి వైపు పయనిస్తుందని, ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని ఐఎండా వివరించింది. 

దీని ప్రభావంతో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News