Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక సూత్రధారి శరత్ చంద్రారెడ్డే.. రిమాండ్ రిపోర్టులో ఈడీ!

ed officials said sharath chandra reddy is the king pin in delhi liquor scam

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక భూమిక పోషించింది సౌత్ గ్రూపేనన్న ఈడీ
  • సౌత్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది శరత్ చంద్రారెడ్డేనని ఆరోపణ
  • ఢిల్లీలో 30 శాతం లిక్కర్ బిజినెస్ ను తన గుప్పెట్లో పెట్టుకున్నారని వెల్లడి
  • సౌత్ గ్రూప్ ద్వారా ఆయన రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారని అభియోగం
  • ఇప్పటికే రూ.64.35 కోట్లను శరత్ ఆర్జించారన్న ఈడీ అధికారులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన పెనాక శరత్ చంద్రారెడ్డికి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనపై కీలక ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో సమర్పించిన శరత్ చంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టులో ఆయనకు ఈ కుంభకోణంలో ఉన్న పాత్ర గురించి కీలక అంశాలను ప్రస్తావించారు. రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ అధికారులు ప్రస్తావించిన అంశాల ఆధారంగానే శరత్ చంద్రారెడ్డిని ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక సూత్రధారి శరత్ చంద్రారెడ్డేనని ఈడీ అధికారులు ఆరోపించారు. ఈ కుంభకోణంలో కీలక భూమిక పోషించినట్లుగా భావిస్తున్న సౌత్ గ్రూప్ ను ఏర్పాటు చేసిందే శరత్ చంద్రారెడ్డి అని ఈడీ ఆరోపించింది. అంతేకాకుండా సౌత్ గ్రూప్ ద్వారా ఏకంగా రూ.100 కోట్లను శరత్ చంద్రారెడ్డి ముడుపులుగా అందించగా... వినయ్ నాయర్ అనే వ్యక్తి మరో రూ.100 కోట్లను ముడుపులుగా అందించారని తెలిపింది. అంతేకాకుండా ఈ స్కాంలో ముడుపులు ముట్టజెప్పిన శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే భారీ ఎత్తున లాభాలు కూడా వెనకేశారని ఈడీ తన రిపోర్టులో వెల్లడించింది.

సౌత్ గ్రూప్ పేరిట రంగంలోకి దిగిన శరత్ చంద్రారెడ్డి ఢిల్లీలో 30 శాతం లిక్కర్ బిజినెస్ ను తన గుప్పెట్లోకి తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. బినామీ కంపెనీల ద్వారా నగరంలోని 9 రిటైల్ జెన్లను శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్నారని తెలిపింది. ఈ జోన్ల ద్వారా ఇప్పటికే ఆయన రూ.64.35 కోట్లను ఆర్జించారని, ఆ నిధుల్లో రూ.60 కోట్లను ఇండో స్పిరిట్ కంపెనీకి బదలాయించేశారని ఆరోపించింది.

  • Loading...

More Telugu News