Lakshman: మోదీ కార్యక్రమాలకు కేసీఆర్ రావాలి: లక్ష్మణ్

Lakshman suggests KCR to come for Modi programmes
  • మోదీ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉండటం సరికాదన్న లక్ష్మణ్ 
  • రాజకీయాలకు, అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను కేసీఆర్ గుర్తించడం లేదని విమర్శ 
  • బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా మోదీ అభివృద్ధి చేస్తున్నారని వ్యాఖ్య 
పార్టీలకు అతీతంగా తమిళనాడు, ఏపీలో ప్రధాని మోదీకి ఆహ్వానం పలుకుతుంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు స్వాగతించడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ప్రధాని పాల్గొంటున్న అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నారని దుయ్యబట్టారు. పీఎం పర్యటనకు సీఎం దూరంగా ఉండటం సరి కాదని చెప్పారు. రాజకీయాలకు, అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను కేసీఆర్ గుర్తించడం లేదని అన్నారు. ప్రధాని కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావాలని కోరారు. 

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రధానిని దగ్గరుండి అడగాల్సింది పోయి... కార్యక్రమాలకే దూరంగా ఉండటం కరెక్ట్ కాదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో కూడా మోదీ ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టారని తెలిపారు. మోదీ పర్యటనను అడ్డుకుంటామంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Lakshman
BJP
Narendra Modi
KCR
TRS

More Telugu News