Sensex: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 1,181 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 61,795కి చేరుకున్న సెన్సెక్స్
- 322 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5.84 శాతం లాభపడ్డ హెచ్డీఎఫ్సీ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. అమెరికాలో వరుసగా నాలుగో నెల ద్రవ్యోల్బణం తగ్గడం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో నెమ్మదించవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. దీంతో వారు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.
ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,181 పాయింట్లు పెరిగి 61,795కి చేరుకుంది. నిఫ్టీ 322 పాయింట్లు లాభపడి 18,349కి ఎగబాకింది. ఐటీ సూచీ 3.70 శాతం, టెక్ సూచీ 3.21 శాతం పెరిగాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (5.84%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (5.62%), ఇన్ఫోసిస్ (4.51%), టెక్ మహీంద్రా (3.64%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.56%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-0.83%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.76%), కోటక్ బ్యాంక్ (-0.73%), డాక్టర్ రెడ్డీస్ (-0.50%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.42%).