Pakistan: నవాజ్ షరీఫ్ కు దౌత్య పాస్ పోర్ట్ మంజూరు చేసిన పాక్ ప్రభుత్వం
- 2019 నుంచి లండన్ లో ఉంటున్న నవాజ్ షరీఫ్
- ఆయన దాత్య పాస్ పోర్టును పునరుద్ధరించని వైనం
- ఇప్పుడు ప్రధానిగా ఉన్న నవాజ్ సోదరుడు షెహబాజ్ హుస్సేన్
లండన్ లో ఉంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు తిరిగి స్వదేశానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతోంది. పలు అవినీతి కేసులను ఎదుర్కొంటున్న నవాజ్ 2019 నుంచి లండన్ లోనే ఉంటున్నారు. ఆయన దౌత్య పాస్ పోర్టు గడువు ఎప్పుడో తీరిపోయినా ఇంత వరకు పునరుద్ధరించలేదు. గత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడు పాక్ ప్రధానిగా ఆయన సోదరుడు షెహబాజ్ షరీఫ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం నవాజ్ కు ఐదేళ్ల కాల పరిమితితో దౌత్య పాస్ పోర్టును జారీ చేసింది. ఇటీవలే షెహబాజ్ షరీఫ్ మంత్రులతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ నవాజ్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దౌత్య పాస్ పోర్టు రావడంతో పాకిస్థాన్ కు వచ్చేందుకు నవాజ్ సిద్ధమవుతున్నారు.