Adithya Menon: 'వీరమల్లు' షూటింగులో అలాంటి ప్రమాదం జరిగింది: నటుడు ఆదిత్య మీనన్
- విలన్ గా ఆదిత్య మీనన్ కి మంచి గుర్తింపు
- వివిధ భాషల్లో విలన్ రోల్స్ లో బిజీ
- 'కార్తికేయ 2'తో మరింత క్రేజ్
- 'వీరమల్లు'లో కీలక రోల్ చేస్తున్న ఆదిత్య మీనన్
- షూటింగులో జరిగిన ప్రమాదం ప్రస్తావన
ఆదిత్య మీనన్ .. పవర్ఫుల్ విలనిజానికి ఈ పేరు కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తుంది. కోటేరు ముక్కు .. చురుకైన చూపులు .. కరుకైన వాయిస్ తో ఆయన ఆకట్టుకుంటాడు. 2003లో తమిళ సినిమాలతో తన కెరియర్ ను ప్రారంభించిన ఆయన, ఆ తరువాత మలయాళ సినిమాల మీదుగా తెలుగు సినిమాలవైపు వచ్చాడు. 'కార్తికేయ 2' వరకూ ఆయన తన విలనిజాన్ని కొనసాగిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "తెలుగులో నా ఫస్టు మూవీ 'బిల్లా'. అయితే ఆ సినిమా వలన కొత్తగా నాకు ఎలాటి అవకాశాలు రాలేదు. 'సింహా' సినిమా తరువాతనే నాకు అవకాశాలు రావడం మొదలైంది. కెరియర్ పరంగా మంచి బిజీగా ఉండగా, ఒక వ్యాధి వచ్చింది. అది ఫేస్ పై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుందని అనడంతో, నటుడిగా ఇక చేయలేనేమోనని భయపడ్డాను" అన్నాడు.
'హరి హర వీరమల్లు' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాను. ఇటీవలే పది రోజుల పాటు షూటింగులో పాల్గొన్నాను. గుర్రపు స్వారీకి సంబంధించిన సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో గుర్రం రెండు కాళ్లపై పైకి లేచి వెనక్కి పడిపోయింది. అది నా మీద పడటంతో అందరూ కంగారు పడిపోయారు. ప్యాంటు లోపల తడిగా అనిపించి కారవాన్ లోకి వెళ్లి చూస్తే అంతా బ్లడ్. దాంతో వెంటనే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది" అంటూ చెప్పుకొచ్చాడు.