Ravan Reddy: నా జీవితాన్ని నాశనం చేసింది మీరే: 'అలిపిరికి అల్లంత దూరంలో' ట్రైలర్ రిలీజ్!
- కొత్త నటీనటులతో రూపొందిన సినిమా
- గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ
- సంగీత దర్శకుడిగా ఫణి కల్యాణ్
- నవంబర్ 18వ తేదీన విడుదల
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల సంఖ్య మరింత ఎక్కువవుతోంది. చిన్న సినిమాల ద్వారా ఎక్కువమంది ఆర్టిస్టులు పరిచయమవుతున్నారు కూడా. ఇక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటే ఈ తరహా సినిమాలకి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అలా ఒక విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందిన సినిమానే 'అలిపిరికి అల్లంత దూరంలో'.
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తిరుమల సమీపంలోని గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఒక వైపున ప్రేమ .. మరో వైపున దానితో ముడిపడిన డబ్బు చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. హీరో హీరోయిన్ ప్రేమ .. పెళ్లి వరకూ వెళ్లాలంటే, హీరోయిన్ తండ్రి ఆశిస్తున్న డబ్బు హీరో దగ్గర ఉండాలి. ఆ డబ్బు కోసం అతను ఏం చేశాడనేదే కథ.
రావణ్ రెడ్డి - శ్రీనిఖిత జంటగా నటించిన ఈ సినిమాను రమేశ్ - రాజేంద్ర నిర్మించగా, ఆనంద్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి ఫణి కల్యాణ్ సంగీతాన్ని సమకూర్చాడు. ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించడానికి ప్రయత్నించారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.