Pakistan: పవర్ ప్లేలో 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను దెబ్బకొట్టిన పాక్
- మెల్బోర్న్ లో పాక్ వర్సెస్ ఇంగ్లండ్
- ఆసక్తికరంగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసిన పాక్
- 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేయగా... ఇంగ్లండ్ తొలి పవర్ ప్లేలో 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది.
పాక్ బౌలర్లు షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్ కొత్తబంతితో ప్రభావవంతంగా బౌలింగ్ చేశారు. అఫ్రిది ప్రమాదకర ఓపెనర్ అలెక్స్ హేల్స్ (1) ను ఓ అద్భుతమైన ఇన్ స్వింగర్ తో బౌల్డ్ చేయగా, 10 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్ ను హరీస్ రవూఫ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే దూకుడు మీదున్న బట్లర్ (26) ను హరీస్ రవూఫ్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది.
ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 49 పరుగులు కాగా... క్రీజులో బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్ ఉన్నారు.