Jeff Bezos: తన సంపదపై కీలక నిర్ణయం తీసుకున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్

Jeff Bezos says he will give majority of his wealth to charity

  • బెజోస్ పేరిట 124 బిలియన్ డాలర్ల సంపద
  • ఒక్క పైసా విదల్చడని ఇటీవలి వరకు బెజోస్ పై విమర్శలు
  • తన సంపదలో అత్యధిక భాగం ఇచ్చేస్తానని ఇటీవల ప్రకటన

ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన సంపదపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సంపదలో అత్యధిక భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేస్తానని వెల్లడించారు. 

124 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగిన బెజోస్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. అత్యంత ధనికుల్లో ఒకడై ఉండి కూడా సామాజిక సేవా కార్యక్రమాలకు ఒక్క పైసా విదల్చడంటూ బెజోస్ పై ఇటీవలి వరకు విమర్శలు వస్తుండేవి. బిల్ గేట్స్ వంటి ప్రముఖులు ప్రపంచక్షేమం కోరి పెద్ద మొత్తంలో చారిటీలకు విరాళాలు ఇస్తుంటే, బెజోస్ మాత్రం వ్యాపార చట్రం నుంచి బయటికి రావడంలేదని వ్యాఖ్యలు వినిపించాయి. 

ఇప్పుడా విమర్శలకు బెజోస్ తన ప్రకటనతో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. తన ఆస్తిలో మెజారిటీ వాటాను వాతావరణ మార్పులపై పోరాటానికి అందిస్తానని ఇటీవల సీఎన్ఎన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెజోస్ తెలిపారు. అంతేకాదు, సామాజికంగా, రాజకీయంగా తీవ్రస్థాయిలో విడిపోయిన మానవత్వాన్ని తిరిగి ఏకం చేయగల వ్యక్తులకు మద్దతు ఇచ్చేందుకు తన ఆస్తిని వినియోగిస్తానని కూడా పేర్కొన్నారు. 

కాగా, బెజోస్ తన విరాళాలకు కాల పరిమితి విధించలేదు. తన సంపదలో అత్యధిక భాగాన్ని తన జీవితకాలంలో విరాళంగా ఇచ్చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News