man: గొంతుకొసి ప్రేయసిని హతమార్చి.. ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

Man dies by suicide on Facebook live hours after killing girlfriend
  • పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి ఘటన
  • మృతురాలు రియాకి ఇది వరకే పెళ్లి, ఒక బాబు ఉన్న వైనం
  • రెండేళ్లుగా కిరణ్ తో అక్రమ సంబందం
  • భర్తను వదిలేసి తనతో రాకపోవడంతో హత్య చేసిన కిరణ్
ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని 35 ముక్కలుగా నరికి చంపిన దారుణమైన సంఘటనతో దేశం షాక్‌కు గురైన తర్వాతి రోజే మరో ఉన్మాది తన ప్రియురాలిని హత్య చేశాడు. తన ప్రేయసిని చంపేసిన సదరు వ్యక్తి ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో చోటు చేసుకుంది. సోమవారం సిలిగురి పోలీసులు రియా బిస్వాస్ అనే మహిళ మృతదేహాన్ని ఆమె ఇంట్లో గుర్తించారు. ప్రియుడిగా భావిస్తున్న కిరణ్ దేబ్‌నాథ్ అనే వ్యక్తి చేతిలో ఆమె హత్యకు గురైందని గుర్తించారు. కాగా, ఆమెను హత్య చేసిన తర్వాత ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన కిరణ్ వేగంగా వెళ్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడాడు. 

పోలీసుల వివరాల ప్రకారం రియాకు మరో వ్యక్తితో ఇది వరకే పెళ్లయింది. ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు. కానీ, కిరణ్ తో రెండేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. అయితే, భర్తను వదలేసి తనతోనే ఉండాలని రియాపై కిరణ్ ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో  కిరణ్ ఆదివారం రాత్రి రియా ఇంటికి వెళ్లాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్తను వదిలేసేందుకు రియా ఒప్పుకోకపోవడంతో కిరణ్ ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని బాత్ రూంలో పడేశాడు. అనంతరం దగ్గర్లోని రైల్వే స్టేషన్ కు వెళ్లిన కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన అతను తాను రియాను చంపేసినట్టు ఒప్పుకున్నాడు. రియా తనను వదిలివేయడంతో మరో మార్గం లేకే ఆమెను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోందని చెప్పాడు.
man
kills
girlfriend
suicide
Facebook live
West Bengal

More Telugu News