Madhya Pradesh: ఆలయం ఆకారంలో ఉన్న బర్త్‌డే కేక్‌ను కట్ చేసిన కమల్‌నాథ్.. విరుచుకుపడుతున్న బీజేపీ

Kamal Nath cuts temple shaped birthday cake BJP Fires

  • ఆలయం ఆకారంలో ఉన్న కేక్ పైన హనుమంతుడి బొమ్మ, కాషాయ జెండా
  • వీడియో వైరల్ కావడంతో బీజేపీ ఆగ్రహం
  • కమల్ నాథ్‌పై తీవ్ర విమర్శలు చేసిన మధ్యప్రదేశ్ సీఎం

ఆలయం ఆకారంలో ఉన్న బర్త్ డే కేకును కట్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై కమలనాథులు విరుచుకుపడుతున్నారు. ఇది హిందువులను అవమానించడం తప్ప మరోటి కాదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్‌నాథ్ కట్ చేసిన కేకు ఆలయం ఆకారంలో ఉండడంతోపాటు పైన హనుమంతుడి బొమ్మ, కాషాయ జెండా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కమల్‌నాథ్ తన సొంత పట్టణమైన చింద్వారాలో మూడు రోజుల పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. మద్దతుదారులు కమల్‌నాథ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన ఇంటి వద్ద వేడుకలు నిర్వహించారు.

వైరల్ అయిన వీడియోపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. మతపరమైన చిహ్నాలతో కూడిన కేక్‌ను కట్ చేయడం ద్వారా కమల్‌నాథ్ వారి మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ నాథ్, ఆయన పార్టీ వారు నిజమైన భక్తులు కాదని, వారికి దేవుడితో ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. ఒకప్పుడు రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారని విమర్శించారు. అయితే, అది ఎన్నికల్లో తమకు ప్రతికూలంగా మారుతుందని గ్రహించి హనుమంతుడి భక్తుడిగా మారిపోయారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News