Hardik Pandya: భావి కెప్టెన్ పాండ్యానే.. పరోక్షంగా చెప్పేసిన లక్ష్మణ్

VVS Laxmans four point verdict on Hardik Pandya as Indias next captain ahead of New Zealand T20Is

  • అతడ్ని ఆటగాళ్ల కెప్టెన్ గా అభివర్ణించిన లక్ష్మణ్
  • పాండ్యా పని విధానం ఆదర్శనీయమని కామెంట్
  • అతడిపై జట్టు సభ్యుల్లో నమ్మకం ఉంటుందని వెల్లడి

హార్థిక్ పాండ్యా భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కావడం ఖాయమేనని తెలుస్తోంది. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొన్ని రోజుల క్రితం ఇదే అంచనా వేశారు. ఇప్పుడు టీమిండియా తాత్కాలిక కోచ్ అయిన వీవీఎస్ లక్ష్మణ్ మాటలు వింటే, ఇది నిజమేనని భావించాల్సి వస్తోంది. రేపటి నుంచి భారత్ జట్టు న్యూజిలాండ్ తో టీ20 సమరంలో తలపడనుండడం తెలిసిందే. మూడు టీ20ల తర్వాత, వన్డే మ్యాచుల్లోనూ ఆడుతుంది. అయితే టీ20 మ్యాచ్ లకు కెప్టెన్ గా పాండ్యా వ్యవహరిస్తున్నాడు. వన్డే మ్యాచ్ లకు శిఖర్ ధావన్ నాయకుడిగా పనిచేయనున్నాడు.

ఈ ఏడాది ఐర్లాండ్ సిరీస్ కు సైతం పాండ్యా కెప్టెన్ గా పనిచేసి విజయాలను అందించాడు. అదే సిరీస్ కు లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ ఇదే జోడి న్యూజిలాండ్ సిరీస్ కు కలసి పనిచేస్తోంది. ఈ క్రమంలో హార్థిక్ పాండ్యాపై లక్ష్మణ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. అతడ్ని ఆటగాళ్ల కెప్టెన్ అని అభివర్ణించాడు.

‘‘అతడు అద్భుతమైన నాయకుడు. ఐపీఎల్ లో అతడు ఏమి సాధించాడో మనం చూశాం. ఐర్లాండ్ పర్యటన సమయంలో నేను అతడితో సమయం వెచ్చించాను. అతడి పాత్ర, పని విధానం ఆదర్శనీయం. అతడు ఆటగాళ్ల నాయకుడు. అతడిపై ఆటగాళ్లలో నమ్మకం ఉంటుంది’’అంటూ పాండ్యా నైపుణ్యాలను లక్ష్మణ్ వివరించాడు. 

‘‘టీ20 క్రికెట్ లో స్వేచ్ఛగా, భయం లేకుండా ఆడాలి. అలా పనిచేసే ఆటగాళ్లు మనకు ఉన్నారు. పరిస్థితులను, సందర్భాలను దృష్టిలో పెట్టుకుని స్వేచ్ఛగా ఆడాలి’’అని లక్ష్మణ్ న్యూజిలాండ్ సిరీస్ కు ముందు ఆటగాళ్లకు సూచన చేశాడు.

  • Loading...

More Telugu News