Care Health insurance: ఎన్నిసార్లు ఆసుప్రతిలో చేరినా చెల్లింపులు చేసే ‘కేర్’ పాలసీ
- ఆటోమేటిక్ రీచార్జ్ ఫీచర్ తో విడుదలైన కేర్ సుప్రీమ్ ప్లాన్
- 500 శాతం వరకు అధిక కవరేజీ
- కాంప్రహెన్సివ్ ప్లాన్ ను తీసుకొచ్చిన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘కేర్’ ఓ కాంప్రహెన్సివ్ హెల్త్ పాలసీ (సమగ్రమైన కవరేజీతో కూడిన)ని ‘కేర్ సుప్రీమ్’ పేరుతో విడుదల చేసింది. వైద్య పరంగా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ పాలసీ ఆదుకుంటుందని సంస్థ ప్రకటించింది.
ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ ఆటోమేటిక్ రీచార్జ్ అనే ముఖ్యమైన ఆప్షన్ ఉంది. దీనివల్ల పాలసీదారుడు లేదా అతడి కుటుంబ సభ్యులు ఒక ఏడాదిలో ఒకటికి మించి ఎన్నిసార్లు ఆసుపత్రుల్లో చేరినా చెల్లింపులు చేస్తుంది. అదే వ్యాధితో, లేదా వేరొక ఆరోగ్య సమస్యతో మళ్లీ మళ్లీ ఆసుపత్రిలో చేరినా చెల్లింపులు లభిస్తాయి. 'సమ్ అష్యూరెన్స్' ఖర్చయిపోతే ఆటోమేటిక్ గా అది మళ్లీ పునరుద్ధరణ అవుతుంది. ఇక ఈ ప్లాన్ లో ఆయుష్ (ఆయుర్వేదం), రోబోటిక్, అవయవ మార్పిడి చికిత్సలకు ఎటువంటి ఉప పరిమితులు లేవు.
‘‘వైద్య పరమైన సాంకేతిక పరిజ్ఞానాల రాకతో చికిత్సల వ్యయాలు పెరిగిపోతున్నాయి. కేర్ సుప్రీమ్ ప్లాన్ పాలసీదారులకు ఆర్థిక భద్రతతోపాటు, అవసరమైతే అత్యుత్తమ చికిత్సను, సమ్ ఇన్సూర్డ్, సుప్రీం రివార్డుల మేరకు పూర్తిగా ఉపయోగించుకునే ప్రయోజనాలను అందిస్తోంది’’అని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ రిటైల్ హెడ్ అజయ్ షా తెలిపారు.