Elon Musk: ట్విట్టర్ ఉద్యోగుల సామూహిక రాజీనామాలు అంటూ వార్తలు... ఎలాన్ మస్క్ స్పందన

Elon Musk reaction over mass resignations in Twitter
  • ట్విట్టర్ ను కొనుగోలు చేసిన మస్క్
  • మొదటి రోజు నుంచే అనూహ్య నిర్ణయాలు
  • యూజర్లలో అనిశ్చితి
  • ఉద్యోగుల్లో అభద్రతాభావం
  • తాజాగా సామూహిక రాజీనామాలు!
  • పలు చోట్ల ట్విట్టర్ కార్యాలయాల మూసివేత
వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ను కొనుగోలు చేయడం తెలిసిందే. ట్విట్టర్ హస్తగతమైన మరుక్షణం నుంచే ఎలాన్ మస్క్ తన ప్రతాపం చూపడం మొదలుపెట్టడంతో యూజర్ల నుంచి ఉద్యోగుల వరకు అందరిలో అనిశ్చితి నెలకొంది. 

తాజాగా, ఉద్యోగులు రోజుకు 12 గంటలపాటు పనిచేయాల్సిందేనని మస్క్ అల్టిమేటం జారీ చేయడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ట్విట్టర్ ను వీడుతున్నారు. ఉద్యోగాలకు సామూహికంగా రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పలుచోట్ల ఉద్యోగులు లేక ట్విట్టర్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ పరిణామాలపై మస్క్ స్పందించారు. 

"పోతే పోనివ్వండి... అంతకు రెట్టింపు సంఖ్యలో ఉద్యోగులు వెళ్లిపోయినా నేను ఏమాత్రం బాధపడను. మాకు నైపుణ్యం ఉన్న ఉద్యోగులు మిగులుతారు" అని వివరణ ఇచ్చారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు మస్క్ పైవిధంగా బదులిచ్చారు. 

ఇక, ట్విట్టర్ ను మూసివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో పలువురు నెటిజన్లు బాధతో స్పందిస్తున్నారు. ట్విట్టర్ ఫాలోవర్లను మిస్ అవుతామంటూ భావోద్వేగాలతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు.
Elon Musk
Twitter
Mass Resignations
Employees
Social Media

More Telugu News