trump: ట్రంప్ పై నిషేధం ఎత్తేయాలా.. వద్దా?.. ట్విట్టర్ లో పోల్ నిర్వహించిన మస్క్

Elon Musks Latest Poll Reinstate Donald Trump On Twitter
  • 2 గంటల్లోనే 20 లక్షల మంది ఓటేసిన వైనం
  • 60 శాతం మంది ట్రంప్ కే అనుకూలం
  • శుక్రవారం సాయంత్రం నుంచి 24 గంటల పాటు కొనసాగనున్న పోల్ 
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా తొలగించి ట్విట్టర్ ఆయనపై జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే! ఇలా నిషేధించిన వారి ఖాతాలను తిరిగి తెరవనున్నట్లు ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ పోయిన వారం ప్రకటించారు. అయితే, అందుకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయని ఆయన వివరించారు. అందులో భాగంగా ట్రంప్ ను తిరిగి ట్విట్టర్ లోకి ఆహ్వానించాలా.. వద్దా..? అంటూ ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ జనాభిప్రాయం అడిగారు. 

ఈమేరకు ఆయన ట్విట్టర్ లో శుక్రవారం సాయంత్రం ఓ పోల్ నిర్వహించారు. మొత్తంగా 24 గంటల పాటు కొనసాగే ఈ అభిప్రాయ సేకరణలో ఇప్పటికే 20 లక్షల మంది పాల్గొన్నారు. అందులో దాదాపు 60 శాతం మంది ట్రంప్ పై నిషేధాన్ని తొలగించాలని కోరారు.

2021లో డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ఆయన ట్వీట్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని, కంపెనీ నియమనిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ట్రంప్ ఖాతాను కంపెనీ తీసేసింది. అలాగే ట్రంప్ పై జీవితకాలం నిషేధం విధించింది. దీనిపై ట్రంప్ కూడా తీవ్రంగానే ప్రతిస్పందించారు. ట్విట్టర్ ఆహ్వానించినా సరే తిరిగి తాను ఖాతా తెరవనంటూ వ్యాఖ్యానించారు. ఆపై ట్రూత్ సోషల్ పేరుతో తనే సొంతంగా ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంను ఏర్పాటు చేసుకున్నారు.
trump
musk
Twitter
poll
Donald Trump
voting

More Telugu News