tarun bhaskar: మళ్లీ మెగా ఫోన్​ పట్టిన తరుణ్​ భాస్కర్​

Director  tarun bhaskars keedaa cola regular shooting started
  • పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలు రూపొందించిన తరుణ్
  • ఆ తర్వాత రైటర్, నటుడిగా బిజీ అయిన వైనం
  • దర్శకుడిగా తన మూడో చిత్రం ‘కీడా కోలా’ రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్టు ప్రకటన
పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరుచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. ఈ రెండు చిత్రాలు భారీ విజయాలు సాధించినప్పటికీ తర్వాత తను అనూహ్యంగా దర్శకత్వానికి దూరం అయ్యాడు. రైటర్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యాడు. నాలుగేళ్ల విరామం తర్వాత తరుణ్ ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. తన మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. ‘కీడా కోలా’ అనే వెరైటీ టైటిల్ తో పాన్ ఇండియా స్థాయితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 

ఆగస్ట్‌లోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. తాజాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టినట్టు తరుణ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కూల్ డ్రింక్ క్యాప్‌ కింద బొద్దింకను చూపిస్తూ డిఫరెంట్ పోస్టర్‌‌తో ఈ విషయం చెప్పాడు. నటీనటుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ దీనిని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది దీనిని విడుదల చేస్తున్నట్టు తరుణ్ ప్రకటించారు.
tarun bhaskar
director
Tollywood
new movie

More Telugu News