Tammineni Sitaram: ఆటలో టీడీపీ ఓడిపోయినట్టు చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమయింది: తమ్మినేని

Tammineni comments on Chandrababu
  • ఎన్టీఆర్ విగ్రహాలను ముట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదన్న తమ్మినేని  
  • బాబులో నిరాశ, నిస్పృహ పెరిగిపోయాయని కామెంట్ 
  • అధికారం అనే మానసిక రోగంతో చంద్రబాబు బాధ పడుతున్నారని ఎద్దేవా 
ఎన్టీఆర్ ను వైకుంఠానికి పంపిన చంద్రబాబుకు ఎన్టీఆర్ విగ్రహాలను ముట్టుకునే అర్హత లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజల కలల్లోకి వచ్చి చంద్రబాబు దుర్మార్గాల గురించి ఎన్టీఆర్ ఆత్మ చెపుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబులో నిరాశ, నిస్పృహ పెరిగిపోయాయని... ఇవే తన చివరి ఎన్నికలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో పోటీకి ముందే ఆటలో టీడీపీ ఓడిపోయిట్టు అర్థమయిందని అన్నారు.

అధికారం అనే మానసిక రోగంతో చంద్రబాబు బాధ పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు చేస్తున్న యాత్రను అసమర్థుడి అంతిమయాత్రగా అభివర్ణించారు. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా జగన్, జనం కలిసే ఉన్నారని చెప్పారు. అసహనాన్ని తగ్గించుకోకపోతే చంద్రబాబుకు నష్టం మరింత పెరుగుతుందని అన్నారు. ప్రపంచ స్థాయి నగరమైన విశాఖను అభివృద్ధి చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు.
Tammineni Sitaram
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News